పెందోట సాహిత్య బాల పురస్కారాల్లో తొగర్ల సురేష్ “సాహస వీరుడు” పుస్తకావిష్కరణ
(జనం సాక్షి ) ముప్కాల్ సెప్టెంబర్ 10 పెందోట బాల సాహిత్య పురస్కారాల కళా పీఠం వారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ గాంధీ చౌక్ మెదక్ నందు జరిగిన సాహిత్య సభలో ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన బాల సాహిత్యం కథల సంపుటి. “సాహస వీరుడు” పుస్తకాన్ని పెందుంట వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు కథ సంపుటి రచయిత సురేష్ మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ తో బాధ్యత మరింత పెరిగిందని మరిన్ని కథ సంపుటలు కవిత పుస్తకాలతో మరింత ముందుకు పోవడానికి పుస్తకావిష్కరణలు తోడ్పడతాయని అన్నారు అనంతరం పుస్తక రచయిత తొగర్ల సురేష్ ను పెందోట సాహిత్య కళాపీఠం వారు ఘనంగా శాలువా జ్ఞాపికతో సత్కరించారు కార్యక్రమంలో వెంకటేశ్వర్లు సంఘభట్ల చిన్న రామకృష్ణయ్య మరియు రాణి ప్రసాద్ మరియు నరసింహచార్యులు కవులు వక్తలు ప్రజలు పాల్గొన్నారు