జేఎల్ ఇంగ్లీష్ పరీక్షకు వ్యాలిడిటీ లేదు

-ప్రకటించిన సిలబస్ ఒకటి వచ్చిన ప్రశ్నలు మరొకటి

-ప్రశ్న పత్రాన్ని పునః పరీక్షించాలని డిమాండ్.

-సీనియర్ ఆంగ్ల ప్రొఫెసర్ తో కమిటీ వేయాలి

ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ డిమాండ్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జేఎల్ పరీక్షల తొలి పరీక్షగా నిన్న జరిగిన జేఎల్ ఆంగ్ల ప్రశ్నాపత్రానికి వ్యాలిడిటీ లేదని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, టీఎస్పీఎస్సీ ప్రకటించిన సిలబస్ ప్రకారం ప్రశ్న పత్రాన్ని తయారు చేయకుండా సిలబస్ లో లేని అంశాలే 70% వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు,తక్షణం టిఎస్పిఎస్సి అధికారులు ఈ ప్రశ్న పత్రాన్ని సమీక్షించి, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,ఈ సందర్భంగా ఓయూ జేఎసి అధ్యక్షుడు డా. ఎల్చల దత్తాత్రేయ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ని ఈ క్రింది అంశా పైన డిమాండ్ చేశారు.
1. ప్రశ్న పత్రాన్ని పునః సమీక్షించి సిలబస్ లో లేని ప్రశ్నలు తొలగించాలి
2. సీనియర్ ప్రొఫెసర్ తో కమిటీ వేసి జెల్ ఆంగ్ల ప్రశ్నాపత్ర వ్యాలిడిటీని తేల్చాలి.
3. కటప్ మార్క్ లను తగ్గించాలి.
ఉమ్మడి రాష్ట్రంలో 2007లో వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ చివరిది,ఇప్పుడు 16 సంవత్సరాల తరువాత వచ్చిన ఈ నోటిఫికేషన్ లో ప్రకటించిన సిలబస్ ప్రకారం ప్రశ్నాపత్రం ఇవ్వకపోవడం నిరుద్యోగులకునిరాశను మిగిల్చింది,ఉద్యోగమే లక్ష్యంగా సన్నదమవుతున్న జెఎల్ ఇంగ్లీష్ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినారు,ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ అధికారులు మేల్కొని ఈ ప్రశ్న పత్రంపై సమీక్ష నిర్వహించి సిలబస్ లో లేని ప్రశ్నలకు తొలగించి,ఆ ప్రశ్న పత్రం యొక్క వ్యాలిడిటీని సీనియర్ ఆంగ్ల ప్రొఫెసర్ తో నిర్ధారించలని, విడుదల చేసే ఫలితాలలో నియామకాల కోసం చేపట్టే కట్ ఆఫ్ మార్కులను తగ్గించి నిరుద్యోగ జేఎల్ ఇంగ్లీష్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎల్ ఆంగ్ల అభ్యర్థులు ప్రణీత్,అంజి యాదవ్,రాజేష్,నరేందర్, షబ్బీర్,నరేష్,చిరంజీవి, నాగరాజు,వంశీ. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ జేఎల్ ఆంగ్ల అభ్యర్థులు పాల్గొన్నారు

తాజావార్తలు