పరీక్షలు జరుగుతుండగా సభకు ఎలా అనుభమతి ఇస్తారు-కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 15. (జనం సాక్షి). పరీక్ష కేంద్రాల సమీపంలో సభలకు ఎలా అనుమతి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో పలు పరీక్ష కేంద్రాల్లో 2927 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మంత్రి కేటీఆర్ సభ నిర్వహించడం పై మండిపడ్డారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అధికార పార్టీ ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందండి మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెలుమల స్వరూప, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ పలు నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు