వినాయక మట్టి విగ్రహాలను పూజించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 16
నిర్మల్ జిల్లాలొకేశ్వరం మండలం లోని హావర్గ గ్రామానికి గంగ ఫర్టిలైజర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నెలకొల్పడం వలన భవిష్యత్తు తరాల విషతుల్యం అవుతున్నాయి కావున మట్టి విగ్రహాలను వాడాలని అన్నారు-సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా మట్టి వినాయకులకు వినాయక చవితి సందర్భంగా అందరూ పూజలు చేయాలని పర్యావరణాన్ని బాధ్యతగా కాపాడుకుందాం అని అన్నారు ఈ కార్యక్రమంలో లోకేశ్వరం మండలం , హవర్గ గ్రామానికి చెందిన *గంగా ఫర్టిలైజర్స్ నిర్మల్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అయినటువంటి దూసాముడి సాయికిరణ్ మరియు ఎంపీడీవో, ఎమ్మార్వో, ఏవో, ఎస్ ఐ, గ్రామ సర్పంచ్ , బిజెపి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయటం జరిగింది