అంగన్వాడీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి మనుగడ ఉండదు
సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

దేవరకొండ సెప్టెంబర్ 16 జనం సాక్షి :-

అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అంగన్వాడీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వం రాష్ట్రంలో మనగడ కొనసాగించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. .శనివారం దేవరకొండ లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అంగన్వాడీ ల ఆరవ రోజు సమ్మె కు సంఘీభావంగా పాల్గొని మాట్లాడుతూ
ఆరు రోజులుగా రాష్ర్టంలో అంగన్వాడి లు సమ్మె చేస్తున్న చర్చలు జరపకుండా సమస్య పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి కూతురు మీద ఉన్న ప్రేమ అంగన్వాడి ఆడపడుచులపై లేకపోవడం విచారకరమని అన్నారు. సమాజంలో ఎన్నో రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీల పట్ల కక్ష సాధింపు చర్యలు పాల్పడడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు. స్వచ్ఛంద సేవకుల్లాగా తక్కువ వేతనాలు ఇస్తున్నప్పటకి ఎన్నో రకాల పనులు చేస్తున్న అంగన్వాడిల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని పనిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సెంటర్ల తాళాలు ఇవ్వాలి అని బలవంతం చేస్తు,తాళాలు పగల గొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు.

CPI జాతీయ కౌన్సిల్ సభ్యులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూగత 48 ఏళ్లుగా icds లో గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరి చేపిస్తూ మహిళల శ్రమ దోపిడీ పాలకులు చేస్తున్నారు అని అన్నారు .
భద్రతలేని బ్రతుకులు చాలి చాలని
వేతనాలతో ఇంకా ఎన్ని ఏళ్ళు పనిచేయాలి అని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పెర్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షురాలు వనం రాధిక,ఉపాధ్యక్షురాలు ఐ అరుణ, మమత,సుజాత, శాంతా బాయి,మనెమ్మా, ప్రభావతి,లక్ష్మి, రెడ్డి బాయి,కళావతి, లావణ్య,స్వప్న,గోపిక, మహిత,మంగా,సువార్త, విజయ లక్ష్మి,,పద్మ, సవిత,కవిత,ప్రమీల, జ్యోతి,నారమ్మ,దొలి, AITUC మండల కార్యదర్శి ఏ మల్లయ్య,వెంకట్ రాములు,,తదితరులు పాల్గొన్నారు