ఎల్‌ఓసీ మంజూరు చేయించిన జడ్పీ చైర్మన్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని మంగళివాడకు చెందిన విష్ణుభక్తుల భానుమూర్తికి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు. భానుమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయాలని మంథని నియోజకవర్గ భీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్‌ను కోరగా ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా రూ.1.25 లక్షల విలువ చేసే ఎల్‌ఓసీ మంజూరీ చేయించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సహయకులు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఎల్‌ఓసీ పత్రం అందజేశారు.