తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గo ఎన్నిక.

జనగామ( జనంసాక్షి)సెప్టెంబర్18:తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రo ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వంచే రెగ్యులర్ అయిన అధ్యాపకులతో జనగామ జిల్లా టీజీఎల్ఏ-711 నూతన కార్యవర్గాన్ని టిజి ఎల్ ఎ రాష్ట్ర కో- కన్వీనర్ గంగారపు రమేష్ ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నుకోవడం జరిగింది. జనగామ జిల్లా అధ్యక్షులుగా మాలి అశోక్, జనరల్ సెక్రటరీగా వి. తిరుమల్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ మధంశెట్టి వరూధిని అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎం. కరుణాకర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ బి.జాంబ, కే. రాజేష్, కోశాధికారిగా జీవనజ్యోతి, మహిళా కార్యదర్శిగా లావణ్య, రాష్ట్ర కౌన్సిలర్ గా జి. నవీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా తిరుపతి, సంయుక్త మహిళా కార్యదర్శిగా కే.శ్వేత, సంయుక్త కార్యదర్శి గా కే.కిషన్ రావు తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు మాలి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సేవలందిస్తున్నందుకు మా సేవలు గుర్తించి రెగ్యులరైజ్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, హరీష్ రావు కి ధన్యవాదాలు తెలియజేస్తూ,తన మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి జనగామ జిల్లా అధ్యాపకులకు మరియు రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం, గంగారపు రమేష్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా సంఘం అభివృద్ధికి సభ్యుల సమస్యల సాధనకు, ఇంటర్ విద్య అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.