ధర్మపురి నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడిగా: క్యాదాస్ స్వామి..
ధర్మపురి (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి మల్లేశం సమక్షంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, రాష్ట్ర నాయకులు సుంకరపల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గొడిసెల రమేష్ లు జిల్లా కేంద్రంలో సోమవారం ఆనంద భవనంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు నియోజకవర్గం అధ్యక్షునిగా జనం సాక్షి రిపోర్టర్ క్యాదాస్ స్వామిని నియమించారు ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైనా అధ్యక్షుడు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అక్రిడేషన్ కార్డుతో పాటు ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తహశీల్దార్ లను కోరుతూ నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.