ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 20(జనం సాక్షి)
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని రాజదాని ఆర్టీసి బస్సు ఢీకోట్టింది..లారీ టైరు పంక్చర్ కావడంతో లారీని రోడ్డుపై నిలిపడంతో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టిసి రాజదాని బస్సు లారీని భలంగా డోకోట్టింది.దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ద్వంసం అయింది.ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగ పది మందికి స్వల్పగాయాలు అయ్యాయి..గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసి బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సంఘటన స్థలానికి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పోలిసులు చేరుకోని కేసుని నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు