టీచర్‌ ఉద్యోగాలకు కొత్త రోస్టర్‌!

డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్‌ ప్రకారం నియమించాలని నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికింది. రోస్టర్‌ను 1వ పాయింట్‌ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది.

ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్‌ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
టీచర్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మంగళవారం రాత్రి 12 గంటల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. వచ్చే నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానికసంస్థల బడుల్లో 5,089 పోస్టుల భర్తీకి గతంలో పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి.

మహిళలకు తక్కువ పోస్టులున్న జిల్లాలివే

04

టీచర్‌ పోస్టుల్లో 51% మహిళలకే
డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల్లో 51శాతం పోస్టులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. అగ్రభాగం పోస్టులు వారికే దక్కాయి. ఇవే కాకుండా ఇక ఓపెన్‌ జనరల్‌ కోటాలోనూ వారు పోటీ పడే అవకాశం ఉన్నది. డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల రోస్టర్‌ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. 5,089 పోస్టులను భర్తీచేస్తుండగా, వీటిలో 2,638 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఓపెన్‌ జనరల్‌ కోటాలో మరో 2,451పోస్టులను రిజర్వ్‌చేశారు. ఓపెన్‌ జనరల్‌ కోటా పోస్టుల్లో పురుషులతో పాటు, మహిళలు పోటీపడే అవకాశం ఉన్నది. ఈ పోస్టులను మెరిట్‌ అధారంగా భర్తీచేస్తారు. జిల్లాల వారీగా తీసుకొంటే 24 జిల్లాల్లో అత్యధిక పోస్టులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. హనుమకొండ జిల్లాలో 54 పోస్టుల్లో 40 పోస్టులు, పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులలో, 31 పోస్టులు మహిళామణులకే రిజర్వ్‌చేశారు. తక్కువ జిల్లాల్లోని పోస్టుల్లో మహిళలకే రిజర్వ్‌చేశారు. అదే అధిక పోస్టులున్న జిల్లాల్లో మాత్రం పూర్తి రోస్టర్‌ పాటించడంతో జనరల్‌ కోటా వాటా దక్కింది. ఇక ఎస్జీటీ పోస్టుల్లో తెలుగు మీడియం పోస్టులే అధికంగా ఉన్నాయి. మీడియం వారీగా తీసుకుంటే ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టులున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో బయాలజీ, సోషల్‌లో ఎక్కువ పోస్టులున్నాయి. పండిట్‌ పోస్టుల్లో తెలుగు పండిట్‌ పోస్టులు అధికంగా ఉన్నాయి.

మహిళలకు ఎక్కువ పోస్టులున్న జిల్లాలు..

05