పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల

జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో రూ.4 కోట్ల 61 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు నిర్మాణానికి, శంకుస్థాపనలు, మహిళల, కుర్మ సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్‌ పత్రాలను మంత్రి అందజేశారు.అలాగే పెగడపల్లి మండలం కేంద్రంలోని 2 కోట్ల రూపాయల నిధులతో షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, ఎంపీపీ గోళి శోభ, వైస్ ఎంపీపీ గంగాధర్, బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు వోరుగంటి రమణా రావు, సర్పంచ్ గుర్రం అనూష, పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పాల్గొన్నారు.