చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘంను పరిశీలించిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి

వేములవాడ సెప్టెంబర్ 22 (జనం.సాక్షి)
చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ను, పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఆయా మండలాల సింగిల్ విండో చైర్మన్లతో కలిసి కొండూరి రవీందర్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలతో చేనేత రంగానికి పెద్దపీఠ వేస్తు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘాల ద్వారా ఎందరో కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. వారివెంట మార్క్ఫెడ్ డైరెక్టర్ నర్సయ్య, చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయసంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ కరుణాకర్,కేడీసీసీ బ్యాంకు మేనేజర్ సాయి, నాయకులు కొండ శేఖర్,తదితరులు ఉన్నారు.