విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలి
రాజంపేట్ సెప్టెంబర్ 22 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బిజెపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజారి ఆయనకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.మండప నిర్వహకులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ రాజంపేట్ మండల ప్రజలకు విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని స్వామివారిని కోరామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బక్కి సంధ్య బాలరాజ్, మండల అధ్యక్షులు గంగారెడ్డి, పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము, ఓబీసీ అధ్యక్షులు చిన్న స్వామి, ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, జుక్కంటి రాజిరెడ్డి, మనోహర్ రెడ్డి, నాగరాజు చారి, తదితరులు పాల్గొన్నారు.