24 గంటల వ్యవసాయ విద్యుత్ ఓ విప్లవం
ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదన్న పోచారం
కామారెడ్డి,ఆగస్ట్14(జనం సాక్షి): వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హావిూ నిలబెట్టుకోవడమే గాకుండా అంతరాయం లేకుండా సాగిస్తున్న సిఎం కెసిఆర్ చరిత్ర సృష్టించారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కరెంట్ ఉత్పాదనపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. గతమూడేళ్లుగా గృహావసరాలకు 24 గంటల విద్యుత్ వస్తోందని అన్నారు. ఇక వ్యవసాయానికి కూడా నిరంతరాయంగా సరఫరా సాగుతోందని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పారు. వచ్చే ఏడాది వానకాలం నుంచి ఏటా 2 పంటలకు నీళ్లు ఇస్తామని ప్రకటించారు. నిజాంసాగర్ కాలువలను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తు న్నామని గుర్తు చేశారు. సింగూరు నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా చూస్తామని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చినట్లు మంత్రి పోచారం తెలిపారు. రూ.3.77 కోట్లతో 42 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పారు. నిజాంసాగర్ కాలువలను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నామన్నారు. సింగూరునీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా చూస్తామని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చినట్లు మంత్రి పోచారం తెలిపారు.రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు పూర్వవైభవం కల్పించేందుకు సుమారు రూ.2 వేల కోట్లతో రివర్స్ పంపింగ్ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేసిందన్నారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగు తోందని, కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పేదలు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూమితో పాటు సాగుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండాలని డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తోందన్నారు. పేద వాడికి కడుపు నిండ అన్నం అందించేందుకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉన్నా, వారికి బియ్యం అందిస్తుందన్నారు. పేదింటి యువతులకు వివాహం భారం కాకూడదని కల్యాణిలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే రైతుల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, రైతులకు నేరుగా ఎకరానికి నాలుగు వేల చొప్పున అందించామని అన్నారు. సీమాంధ్ర నాయకుల మాదిరిగా సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కంగ్రెస్ నేతలు కుట్రలు పన్నడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోమని, తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
———–