రాగల 24 గం.ల్లో తెలంగాణలో వానలు..

హైదరాబాద్: రాగల 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తుండడంతో, 24 గంటల్లో అల్పపీడనం బలహీన పడే అవకాశమున్నట్లు సమాచారం. అల్ప పీడనం బలహీనపడితే రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు వెల్లడించారు.