25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం
హైదరాబాద్: ఈ ఏడాది 40వేల 400కోట్ల రూపాయలతో 25 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్పహక మండలి ఉన్నత స్థాయి సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. కొత్త పరిశ్రమలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఏర్పాటవుతున్నాయన్న విమర్శలన్నీ చెక్ పెడుతూ కొత్త వాటిని 12 జిల్లాల్లోనే ఏర్పాట్లయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఒత్తగా ఆమోదించిన వాటిలో 13సిమెంట్, 6కెమికల్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ప్లాస్టిక్, స్టీల్, ఇతర రంగాలకు సంబంధించి ఒక్కో పరిశ్రమ ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాది ఆమోదించిన 44 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకూ 14 పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. మిగిలిన 27 పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయని ఆమె చెప్పారు.