25 వేల మాఫిపై కుయుక్తులు..?
కాకతీయఖని, జూన్ 16 (జనంసాక్షి) :సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయడంపై ఏఐటీయూసీి, ఐఎనటీయూసీ, టీబీజీకేఎస్‌లు కు యుక్తులు పన్నుతున్నట్లు హెచ్ఎంఎస్ భూపాల పల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు వారణాసి గౌరీపతిశర్మ విమర్శించారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ సంఘాలు ఏరియర్స్‌పై కపట నాటకం ఆడుతు న్నట్లు ఆరోపించారు. ఇంతకాలం గుర్తుకురాని స మస్యను ఎన్నికల ముందు తెరమీదికి తీసుకురావ డం వారి స్వార్థప్రయోజనాలకు అద్దపడుతున్నట్లు పేర్కొనారు. కోల్ఇండియాలో జరిగిన సమావ ేశంలో ఏరియర్స్‌పై చర్చించిన నాయకులు 25 వేల మాఫి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్ర శ్నించారు. చర్చలు జరుగుతుండగానే సమ్మెను విరమించి యాజమాన్యం వద్ద లొంగుబాటు దోర ణిని ఏఐటీయూసీి, ఐఎన్టీయూసీ అవలంబిం చడంతోనే అడ్వాన్స్ పై యాజమాన్యం స్పందించ డం లేదన్నారు. నాడే యాజమాన్యం వద్ద గట్టిగా ప్రశ్నిస్తే అడ్వాన్స్‌కు బదులుగా బోనస్ వచ్చేదని పేర్కొన్నారు. సమ్మె కాలంలో ఏఐటీయూసీి, ఐఎన్టీయూసీ నాయకులు గనుల వద్దకు కనీసం రాకుండా సమ్మె విరమణ జరగక ముందే యాజ మాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని కార్మికులకు తీరని అన్యాయం చేశారని విమర్శిం చారు. అడ్వాన్స్‌ను మాఫి చేయించాల్సిన బాధ్యత ఆ సంఘాల నాయకులదేనని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ ఈ విషయంలో డ్రామాలాడుతున్నట్లు విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ జె ఏసి నా యకులు ఈ విషయంలో స్పందించి కార్మి కులకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చే శారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, సుదర్శన్, శ్రీనివాస్, విజయ్, యుగం ధర్, బిక్షపతి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.