26లోగా చెప్పాల్సిందే..
అదిలాబాద్, డిసెంబర్ 12 :ఈ నెల 26వ తేదీలోగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయమై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోతే పార్టీలను పాతర వేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు బుధవారంనాటికి 1074వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయా పార్టీల వైఖరిని తెలుసుకునేందుకు కేంద్రం ఈ నెల 28న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందున రెండు రోజుల ముందు తమ వైఖరిని వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం ఆయా పార్టీల వైఖరిని తెలుసుకుని తెలంగాణను ఏర్పాటు చేయక మళ్లీ మోసం చేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.