27న సమరదీక్ష : తెలంగాణ ఉద్యోగ ఐకాస

హైదరాబాద్‌: ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద సమరదీక్ష చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది. తెలంగాణ అంశంపై చర్చించేందుకు పాత ఎమ్మెల్యే నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అంశంపై నెలరోజుల్లోగా నిర్ణయం వెల్లడిస్తామని హామి ఇచ్చిన కేంత్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట తప్పి అఖిలపక్ష సమావేశానికి హాజరైన అందరీని అవమానించారని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఆగ్రహం వ్యక్తం చేసింది.