27మంది కమ్యూనిటీ గార్డుల నియామకం

విశాఖపట్నం : నగర కమిషనరేట్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గార్డుల వ్వవస్థలో 27మందికి శిక్షణ ఇచ్చి నియమించినట్లు సీపీ పూర్ణ చంద్రరావు తెలిపారు. బుధవారం కమిషనరేటే సమావేశ మందిరంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్‌ యువ కిరణాలు కార్యక్రమం కింద పలువురు యువకులను ఎంపిక చేసి వారికి పోలీస్‌ శిక్షణ ఇప్పించి శాంతి భద్రతలను మెరుగు పరచటంలో కమ్యూనిటీ గార్డులను వినియోగించుకోనున్నామని తెలిపారు. తొలివిడతగా 27మందిని వివిధ ప్రాంతాల్లో నియమించామని చెప్పారు.