27నుంచి విలేకరులకు శిక్షణ
కరీంనగర్, జూలై 23 : జూలై 27, 28 తేదీలలో మెట్‌పల్లిలో ప్రెస్ అకాడమి, శాతవాహన యూనివర్సిటి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ విలేకర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమి సెక్రెటరీ జి. సన్యాసిరావు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్‌పల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ కాలేజిలో జరుగు రెండు రోజుల శిక్షణ తరగతుల ద్వారా గ్రామీణ విలేకర్లకు వృత్తినైపుణ్యత పెంపొందించుటకు అనుభజ్ఞులైన వారిచే శిక్షన ఇవ్వనున్నట్లు తెలిపారు. మారుతున్న సమాజంలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమాచారం అందించుటలో తగిన సూచనలు, మెళుకువలు శిక్షణ తరగతుల ద్వారా తెలుపుతారని అన్నారు. రెండు రోజుల శిక్షణ తరగతులకు జిల్లాలోని గ్రామీణ విలేకర్లందరు హాజరు అయ్యి న్యాయవంతం చేయాలని ప్రెస్ సెక్రటరీ ఆ ప్రకటనలో తెలిపారు.