28న విడుదల కానున్న రామారావు ఆన్ డ్యూటీ
కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో
రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ’ఖిలాడీ’తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్‌రాజ ఈ సారి ’రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 28న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. రామారావు యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతుంది. రవితేజ ఈ చిత్రంలో డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించ నున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోª`టటెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్‌టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.