29వ తారీకు తలపెట్టిన బందుకు సంపూర్ణ మద్దతుగా అఖిలపక్షాలు.

 

– బందుకు పిలుపునిచ్చిన జేఏసీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు…

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో గోదావరి వరద గ్రామాలకు అండగా మేముంటామని అఖిలపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోదావరి వరద గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయం చేయాలని జేఏసీ పిలుపుమేరకు 29వ తారీకు సోమవారం జరిగే బూర్గంపహాడ్ మండల బందులో అందరూ స్వచ్ఛందంగా బందును పాటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలుపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జగదీశ్వర రావు, భయ్యా రాము, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహూర్, రాయల వెంకటేశ్వర్లు, కొమర్రాజు సత్యనారాయణ, బర్ల తిరుపతయ్య, ఎర్లంకి అప్పారావు, తోకల కొండలరావు, దాసరి సాంబ, తదితరులు పాల్గొన్నారు.