నీటిమట్టం పెరగడంతో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వాజేడు: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటికి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో గత 14 రోజులుగా 29 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏడు రోజులు నుంచి 25 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలకు తాగునీరు సరఫరాకావడంలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.