3న కొత్తగూడెం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా
బెల్లంపల్లి పట్టణం : సింగరేణిలో బొగ్గు అన్వేషణ పనులను ప్రైవేటు డ్రిల్లింగ్ కంపెనీలకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 3న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ బెల్లంపల్లి శాఖ కార్యదర్శి ఎం వెంకటస్వామి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తబ్లాకులలో డ్రిల్లింగ్ అవుట్ సోర్శింగ్‌కు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.