3న గీతారెడ్డి రాక

మెదక్‌, డిసెంబర్‌ 1: రాష్ట్ర భారీ పరిశ్రమలు, చక్కెర శాఖమంత్రి గీతారెడ్డి ఈ నెల మూడున జహీరాబాద్‌కు రానున్నట్టు జిల్లా కలెక్టర్‌ శనివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జహీరాబాద్‌లోని యూనిటెడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించు యూత్‌ కాంగ్రెస్‌ ట్రేనింగ్‌ క్యాంప్‌కు హాజరై తదుపరి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. సాయంత్రం ఆరుగంటలకు తిరిగి బయలుదేరి వెళ్తారని కలెక్టర్‌ వివరించారు.