3వ రోజు మైలారం భూ నిర్వాసితుల ఆందోళన
శాయంపేట జూన్ 16(జనంసాక్షి) : శాయంపేట మండలం మైలారం శివారులో దేవాదుల ఆడిట్ పాయింట్ వద్ద భూనష్ట పరిహారం కోసం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన శనివారం 3వ రోజు కొనసాగింది. బుంగ పూడ్చివేత కోసం వెళ్తున్న వాహనాలను కొద్దిసేపు ఆందోళనకారులు అడ్డు కు న్నారు. టీడీపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.