3 వ రోజు నిరాహార దిక్ష విరమింపజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార…

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్26 (జనంసాక్షి);
ధరణి వస్తె రైతుల సమస్యలు పోతాయన్నారు కాని కొత్త సమస్యలు వచ్చాయి,ప్రజా ప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి పని కాక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.దీక్ష వద్దకు వచ్చి రైతులు సమస్యలు చెప్తుంటే హృదయం ద్రవించి పోతుందని కామారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అన్నారు. జిల్లా నలుగురు యంయల్ఎ ల చట్ర బంధం లో జిల్లా కలెక్టర్ ఉన్నారు.ధరణి సమస్యకి రెవెన్యూ అధికారుల నిర్లక్యం కారణమా లేక ప్రభుత్వం కావాలనే రైతులను ఇబ్బంది పెడుతుందా అని విమర్శించారు.కొంత మంది అధికార పార్టీ నాయకులు తమకు ఉన్న భూమి కన్నా ఎక్కువ ఆన్లైన్ లో వేయించుకున్నారు.సిరిసిల్ల లో కెటిఅర్ బాన్సవాడ లో పోచారం అడవి భూములకు రెవెన్యూ పట్టాలు ఇప్పించారు.ధరణి సమస్య పరిష్కారం అయ్యే వరకు మంగళవారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చెపట్టనున్నారు.
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ,ధరణి తో రైతు గోస విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి గత 6 రోజులుగా 3 రోజులు నిరసన దీక్షా, 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దీక్ష శిబిరానికి బీజేపీ జిల్లా రథ సారథి అరుణా తార వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా శిబిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అరుణా తరా మాట్లాడుతూ ధరణి వస్తె రైతుల సమస్యలు పోతాయన్నారు కాని కొత్త సమస్యలు వచ్చాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ భూముల సమస్యల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పని కాక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారనీ వాపోయారు.రైతు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తాను ఈ రోజు ఉదయం నుండి దీక్ష వద్ద ఉన్నానని, దీక్ష వద్దకు వచ్చి రైతులు తమ సమస్యలు చెప్తుంటే హృదయం ద్రవించి పోతుందనీ, ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు.బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ధరణి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు చిరువ చూపక పోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని జిల్లా కలెక్టర్ జిల్లా కి సంభందించిన 4 గురు యంయల్ఎ ల చట్ర బంధనం లో ఉన్నారని, ధరణి వల్ల ఏర్పడే సమస్యలు రెవిన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే దీక్షకు పూనుకున్నాం. పాస్ పుస్తకాల్లో ఉన్న భూమి ధరణి పోర్టల్ లో కనిపించక రైతుబంధు రావడం లేదు. అధికారులను అడిగితే కేసీఆర్ లాక్ తీస్తే అవుతాయి అని చెప్తున్నారు. ఒక్కొక్క తహసీల్దార్ వద్ద వెయ్యి నుంచి 2 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయనీ,
టీఎం33 ద్వారా సమస్యలు పరిషకరించే వీలున్నా చేయడం లేదు. టీఎం 33 లో 1000 రూపాయలు కట్టి చేసిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల వరకు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్క దరఖాస్తుకు వెయ్యి చొప్పున అంటే సుమారు 100 కోట్లు రాష్ట్ర ఖజానాకు వెళ్తుంది.రైతుల దరఖాస్తును అకారణంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.
రిజెక్ట్ కావడంతో ఒక్కొక్కరు మూడు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి 2 వేల నుంచి 2500 కోట్ల ఆదాయం వస్తుంది. భవానిపేట శివారులో 769 సర్వే నంబరులో 625 ఎకరాల భూమిని 930 ఎకరాలకు మార్చి 300 ఎకరాల భూమికి అధికార పార్టీ నాయకులు రైతుబందు పొందుతున్నారు.అటవీశాఖ భూమిని రెవిన్యూ పట్టాలుగా చేసిన ఘనులు రెవిన్యూ అధికారులు మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం ఇలాకాలో చేశారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని, నేను చేపట్టిన దీక్ష వద్దకు ఇప్పటివరకు 8 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు దీక్షలు ఆపేది లేదనీ అన్నారు. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతనీ, సమస్యలు పరిష్కారం అయితే ఇంటికి లేకపోతే కాటికి పోతనాని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి దీక్ష భగ్నం చేస్తే గ్రామాల్లో నిరాహార దీక్షలు చేస్తాం.రైతులకు నష్టం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఇఒ కార్యక్రమం లొ ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ లు శ్రీనివాస్, మానస, నాయకులు భరత్, సురేష్, నరేష్, వెంకట్, రవి, నవీన్, సంతోష్ రెడ్డి, సాయి, హారిక, బలమని, లింగం, రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.