3 నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఇంజీరింగ్‌, ఫార్మసీ కోర్సుల అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 3 నుంచి కాలేజీల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య పీ జయప్రకాశ్‌రావు తెలిపారు. సెప్టెంబర్‌ 3నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లు, 17 న సీట్ల కేటాయింపు, 23 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల విద్యార్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరయినట్లు ప్రకటించారు.