30న బిఎంఎస్‌లోకి కెంగెర్ల మల్లయ్య

పెద్దపల్లి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలే రాజనీమా చేసిన ఆయన బిజెపి అనుబంధ సంఘంలో చేరనున్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసే సభలో కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, వేజ్‌బోర్డు సభ్యుడు డీకే.రాయ్‌సమక్షంలో మూడు వేల మందితో చేరుతున్నట్లు ప్రకటించారు. గోదావరిఖనిలో ఈ నెల 30న బీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సభను విజయవంతం చేయాలని ఆ యూనియన్‌ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీరమనేని రవీందర్‌రావు కోరారు.