30 మంది వాలంటీర్లకు శిక్షణ
దండేపల్లి, జనంసాక్షి: భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఎంపికైన 30మంది యువకులకు దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణాధికారి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా మంజూరయ్యే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా వాలంటీర్లు కృషి చేయాలని అధికారులకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి, నర్సాపూర్, మామిడిపల్లి గ్రామాలకు చెందిన వాలంటీర్లు పాల్గొన్నారు.