330 పరుగుల ఆధిక్యంలో భారత్
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫాలోఆన్ గండం నుంచి తప్పంచుకోలేకపోయింది. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ కుప్పకూలి పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నంగ్స్‌లోనే 191 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ 330 పరుగుల అధిక్యంలో నిలిచింది. భారత్ బౌలర్లు ఓజా-5, ఆశ్విన్-3 వికెట్లు పడగోట్టగా జహీర్, యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు వికెట్ల నష్టానికి 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభంలోనే కష్టాల్లో కూరుకుపోయింది. భోజన విరామ సమయానికే మరో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఫొలోఆన్ అంచున నిలిచినట్టయింది.