35కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శుక్రవారం 293 మందిని బలితీసుకోగా ఈరోజు వడదెబ్బకు 35 మంది మృతి చెందారు. మృతులు వివరాలు… ప్రకాశం7, నల్గొండ , విశాఖ, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, కరీంనగర్ , తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున , అనంతపురం, పశ్చిమగోదావరి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృతి చెందారు.