35 లక్షలు పట్టివేత
మహబూబాబాద్,నవంబర్6(జనంసాక్షి): జిల్లాలో పోలీసలు తనిఖృల్లో భారీగా డబ్బు పట్టుబడింది. దంతాలపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ.35 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాహనాన్ని, నగదును ఐటీ శాఖకు అప్పగిస్తామని తెలిపారు.