38వ రోజుకు చేరిన గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మె
ములుగు,ఆగస్ట్31(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 3హామీలు పే స్కేల్ జీవో మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఫిబ్రవరి 24 2017 న రాష్ట్ర గ్రామ రెవెన్యూసహాయకుల కమిటీతో మొదటిసారిగా ప్రగతిభవన్లో హామీ ఇచ్చారు మరియు సెప్టెంబర్ 9 2020 అసెంబ్లీ చట్టసభలో రెండవసారి రెవెన్యూ చట్టం చేస్తూ వీఆర్ఏలకు హామీ ఇచ్చారు మరియు మార్చి 18 2022 తేదీనకూడా మూడవసారి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది.ఇట్టి హామీని నెరవేర్చి జీవోలను విడుదల చేసేంతవరకు శాంతియుతంగా ఈ నిరవధిక సమ్మెను ముందు కు కొనసాగిస్తాము. బుధవారం రోజున ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 38వ రోజుకు చేరింది.
ఇట్టి సమ్మె వెంకటాపూర్ మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెదీక్ష శిభిరం వద్ద ఈరోజు కార్యచరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఆర్ఏలు దీక్షా శిబిరం వద్ద కూర్చొని మహాత్మా గాంధీ మార్గంలో వీఆర్ఏల డిమాండ్స్ ప్లకార్డ్ ముందు పెట్టుకొని శాంతియుతంగా నిశబ్దంతో
38వరోజు నిరసనలు తెలియ పరచడమైనది. మండల వీఆర్ఏల ఉపాధ్యక్షులు తొగరి మురళి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చట్టసభ సాక్షిగా వీఆర్ఏలకు హామీలు ప్రకటించినారు. హామీలు ఇచ్చి రెండేళ్లు కావస్తున్న జీవోలు ఇవ్వలేదు.హామీలు ఆవిరిగానే మిగిలిపోయాయి తెలంగాణ రాష్ట్రమంతటా విఆర్ఏలు 23వేల మంది ఉన్నారు వీఆర్ఏలు ప్రతిమండలాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జూలై 25 2022నుండి నిరవధిక సమ్మెలో కూర్చొని 38 రోజులు కావస్తున్నాది. ఈరోజు వరకు ఈ రాష్ట్రప్రభుత్వం వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది.వీఆర్ఏల కోరికలు న్యాయమైనవి మా డిమాండ్స్ ను ఈరాష్ట్రప్రభుత్వం వెంటనే జిఓలు విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేసినారు.ఇట్టి 38వ రోజు నిరవధిక సమ్మె
నిరసనలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య,వెంకటాపూర్ మండల వీఆర్ఏల మండల అధ్యక్షులు నక్క శశి కుమార్,ఉపాధ్యక్షులు తొగరి మురళి ,కార్యదర్శి మంతెన స్వప్న, సరిత, సునీత, సమ్మక్క, బిక్షపతి,రాజమౌళి,కిషన్,భాస్కర్ , శంకర్,రాజయ్య,రాయమల్లు,కిరణ్,శ్ రీనాథ్ మరియు మండల విఆర్ఎల్ అందరూ పాల్గొన్నారు.