4నుంచి వేసవి క్రీడా శిబిరం

నిజామాబాద్‌,మే1(జ‌నం సాక్షి):ఈ నెల 4వ తేదీన నిజామాబాద్‌ నగరంలోని కలెక్టర్‌ మైదానంలో వేసవి కాలం క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నామన్ని నగర మేయర్‌ ఆకుల సుజాత తెలిపారు. మొట్టమొదటి సారిగ నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ క్రీడల వలన నగర విద్యార్థులలో ఉన్న క్రీడాసక్తిని పెంపొందించడంతో పాటు జిల్లా,రాష్ట్ర,దేశ,అంతర్జాతీయ స్థాయి క్రీడకారులుగా వారిని తీర్చిదిద్దడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడమే ఈ శిక్షణ లక్ష్యమని అన్నారు. ఈ క్రీడలల్లో అథ్లెటిక్స్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, చపక్‌ టక్ర, ఫుట్బాల్‌, హాకీ,హ్యాండ్‌ బాల్‌, కబడ్డీ, ఉషు ఇలా 9 రకల క్రీడలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రతి రోజు కలెక్టర్‌ మైదానంలో ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు తిరిగి సాయంత్రం 5:30నిముషాల నుండి 7:30నిముషాల వరకు పేరును నమోదు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, కొర్పొరేటర్లు పాల్గొన్నారు.