4 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం
సంగారెడ్డి, జూలై 30 : మనూర్ మండలం ఎర్కపల్లి గ్రామ పంచాయితీ పాతూతాండాలో అక్రమంగా 3.5 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్న 3.5 ఎకరాలలో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలను సివిల్ పోలీసులు సోమవారంనాడు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మనూర్ ఎస్‌ఐ బాలస్వామి, ఆర్‌ఐ యాసింఖాన్, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.