40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోంది

సీఎం కిరణ్‌
న్యూఢల్లీి : 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గత భద్రతపై ఢల్లీిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుని నక్సల్స్‌ను ఎదుర్కొంటున్నామని తెలిపారు. గడిచిన 20 ఏళ్లలో నక్సల్స్‌కు సంబంధించిన పెద్ద ఘటన రాష్ట్రంలో జరగలేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 జిల్లాలో నక్సల్స్‌ కార్యకలాపాలు నడుస్తున్నాయని తెలిపారు.