438కి భారత్‌ అలౌట్‌

హైదరాబాద్‌:  భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య స్థానిక ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్‌మ్యాచ్‌లో భారతజట్టు 438 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5వికెట్ల నష్టానికి 307పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో 2వరోజు బరిలోకి దిగిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పూజరా 159పరుగుల, అశ్విన్‌37 పరుగులు సాధించారు. న్యూజిలాండ్‌ బౌలర్లు పటేల్‌ 4వికెట్లు, బౌల్టు 3వికెట్లు సాధించారు.