తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం

లగడపాటి, రాయపాటి పిలుపులు భేఖాతర్‌

హైకోర్టు , రాజధాని, కొత్త ఉద్యోగాలపై సీమాంధ్రాలో ఆసక్తికర చర

విజయవాడ,జనవరి5(జనంసాక్షి):

తెలంగాణపై ఈ నెలాఖరులోగా ఓ నిర్ణయం రానుందన్న వార్తల నేపథ్యంలో సీమాంధ్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజంగానే తెలంగణ ఏర్పడితే సీమాంధ్ర రాజధాని విజయవాడా లేక, వైజాగా అన్న చర్చను ప్రజలు లేవనెత్తున్నారు. కావూరి, లగడపాటి, రాయపాటిల సమైక్య నినాదాలపై ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా రాజధాని, హైకోర్టు తదితర అంశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఆంధ్ర రాష్టాన్రికి విశాలమైన సముద్రతీరం ఉంది. వెనుకబడిన జిల్లాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడితే ఒక రాజధాని, సెక్రటేరియట్‌, ఉద్యోగావకా శాలు అన్ని పరిపాలన వ్యవస్థలు అందుబాటులో వస్తాయని  సామాన్యుల చర్చల్లో ప్రధానంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు వల్ల సమైక్యాంధ్రకు వచ్చే నష్టం ఏవిూ లేదన్న భావన కూడా కలుగుతోంది. అంతేగాకుండా వేలకొద్దీ