46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి

తూర్పుగోదావరి: గోదావరి వరద ఉద్ధృతికి కోనసీమలో 46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 46 గ్రామాల్లో దాదాపు లక్షా 30 వేల మంది ఉన్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పి. గన్నవరం అక్డిడెక్టు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.