47కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, వరంగల్‌లో 5గురు, కరీంనగర్‌లో 4గురు , నిజామాబాద్‌లో ముగ్గురు, నెల్లూరు, ప్రకాశం, ఆదిలాబాద్ , ఖమ్మం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మహబూబ్‌నగర్, తూర్పుగోదావరి, నల్గొండ , అనంతపురం, కర్నూలు, రంగారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఈరోజు విజయవాడ, కాకినాడల్లో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాకినాడల్లో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.