48గంటల్లో ర్రాష్టంలో ఒక మోస్తరు భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిందిన. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి బలపడిందని దాని వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో 48గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలు చోట్ల తెలంగాణలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ కేంద్రం తెలిపింది. తమిళనాడు-శ్రీలంకల మధ్‌య బంగాళాఖాతంలో ఉపరిత అవర్తనం స్థిరంగా కొనసాగుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

తాజావార్తలు