55 మంది మత్య్సకారులను విడుదల చేసిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: స్వాతంత్య్రదినోత్సవ నేపథ్యంలో సౌహార్ద్ర సూచికగా  భారత్‌కు చెందిన 55 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ ప్రభుత్వ కరాచీ జైలు నుంచి ఈ రోజు విడుదల చేసింది. వాళ్లని రేపు వాఘా సరిహద్దు వద్దకు పంపనున్నారు. వీరిలో చాలామంది. గుజరాత్‌కి చెందినవారు. ఇంకా మరో 80 మంది దాకా మత్స్యకారులు పాక్‌ జైళ్లలో ఉన్నట్లు సమాచారం.