56 సెకన్లలో 36 అవయవాల పరీక్ష

ఉచిత వైద్యశిబిరంలో సేవలు

హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలీ హౌజింగ్‌ బోర్డు తిరుమలనగర్‌ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, తిరుమలనగర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో దేహంలోని 36 అవయవాల పనితీరును వైద్యులు పరీక్షించారు. రెట్రో ఇండియా హెల్త్‌కేర్‌ సంస్థ అవాయిడ్‌ హార్ట్‌ ఎటాక్‌ అనే నినాదంతో కేవలం 56 సెకన్లలో 36 అవయవాలను పరీక్షించే ఏర్పాట్లు చేసింది. పరీక్షలు చేయించుకున్నవారికి వారి పరిస్థితి వివరించి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. గుండెపోటు మరణాలను అరికట్టడానికి రెట్రో హెల్త్‌కేర్‌ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.