610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 21 : ఎట్టకేలకు 610 జీవో అమలుకు మార్గం సుగమమైంది. ఈ జీవోను హైకోర్టు సమర్ధించింది. 610 జీవోపై వేలాదిగా వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారంనాడు విచారించి తుది తీర్పును ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల బదిలీ, నియామకాల్లో ఇప్పటి నుంచే ఈ జీవోను అమలు చేయలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగిలిన విభాగాల్లో జారీ తేదీ నుంచి ఈ జీవోను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో ఉపాధ్యాయేతర విభాగాల్లో భారీగా బదిలీలకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక జీవో 8 అమలుకు కూడా మార్గం సుగమమైంది. ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఉత్తర్వులు ఎంతో అనుకూలం. 610, 674 జీవోలను హైకోర్టు సమర్ధిస్తూ 80 శాతం ఉద్యోగాలను స్థానికులే కేటాయించాలని పేర్కొంది.