62వ రోజుకి చేరిన ఉచిత అల్పాహారం పంపిణీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): క్రమశిక్షణ, నిబద్ధతలు కవచాలుగా నిరాడంబరంగా జీవిస్తూ, ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో వ్యాపారం చేసి అంచెలంచెలుగా ఎదిగి సమాజ సేవకు తమ జీవితం అంకితం చేసిన స్వర్గీయ  అనంతల జనార్దన్, మీలా సత్యనారాయణలు నేటి యువతకు ఆదర్శమని లయన్స్ క్లబ్ , సూర్యాపేట  అధ్యక్షులు డాక్టర్ ఆదుర్తి రమేష్ అన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు లయన్స్ క్లబ్, అన్ని క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ అల్పాహారం పంపిణీ కార్యక్రమం సోమవారం నాటికి 62వ రోజుకి చేరింది.అనంతుల జనార్దన్, మీలా సత్యనారాయణ ల జ్ఞాపకార్థం  మీలా విజయలక్ష్మి  మహదేవ్ దంపతులు, అనంతుల శారద కృపాకర్ దంపతుల ఆధ్వర్యంలో అల్పాహారాన్ని  పంపిణీ చేశారు.ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు ప్రతినెల 200 కిలోల బియ్యం అందజేయడానికి ముందుకు వచ్చిన మీలా మహదేవ్ , అనంతుల క్ర్రపాకర్ లకు లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు , తోట శ్యామ్ ప్రసాద్ , లయన్స్ క్లబ్ ఆర్సీ చిలుముల శ్రీనివాస రెడ్డి, జెడ్సీ మర్రు హనుమంతరావు , ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్ , రఫి, లక్ష్మికాంత్ రెడ్డి , వీర్లపాటి వెంకటేశ్వర్లు , కలకోట లక్ష్మయ్య, బిక్కుమళ్ల కృష్ణ , గుండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.