63రోజులు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమ్మె
మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు ఆదివారం తహశీల్దార్ కార్యాలయం ముందుసమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి,వీఆర్ఏ మండల అధ్యక్షుడు పుర్ర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్,కమిటీ సభ్యులు హనుమంతు నాగార్జున,శంకరన్న, రంగస్వామి,భీముడు,లక్ష్మణ్, ఆంజనేయులు,తిమ్మన్న, తిమ్మమ్మ ,లక్ష్మీ దేవమ్మ, సోమేశ్వరమ్మ,మునెమ్మ, నామాల వినోద్,అశోక్ ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.