జిల్లాలో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యల కోసం కరీంనగర్‌లోని కలెక్టర్‌ కార్యాలయానికి 3 హెలికాప్టర్లు చేరుకున్నాయి. అధికారులతె కలెక్టర్‌ సమీక్ష అనంతరం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు హెలికాప్టర్లు బయలుదేరనున్నాయి. మహాముత్తారం, మహదేవపూర్‌ మండలాల్లో వరదలో చిక్కుకున్న గ్రామాల్లో ఆహార పొట్లాలను హెలికాప్టర్ల ద్వారా అందజేయనున్నారు.