కరీంనగర్ జిల్లాలో ఆరుగురు మృతి
కరీంనగర్,(జనంసాక్షి): భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మంథని డివిజన్‌లో వరదల వల్ల 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ వరదలకు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారని ఆయన చెప్పారు.
భారీ వర్షానికి 9865 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, ఇప్పటికే మంథని డివిజన్‌లో ఏర్పాటు చేసిన 10 సహాయ కేంద్రాల్లో 1600 మందికి పునరావాసం కల్పించామని మంత్రి తెలిపారు. మరోవైపు జలదిగ్భందంలో చిక్కుకున్న గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.



